ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలం కరగాం పంచాయతీలో రైతుల వద్దకు నేరుగా వెళ్లి ధాన్యం కొనుగోళ్లపై వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని చెప్పారు.