పథకాల పేర్లపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని ఎచ్చెర్ల మండలం జనసేనపార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ పథకాలైన విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రంగా, మద్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మద్యాహ్న బడి భోజనంగా, ప్రతిభా పురస్కారాలను అబ్దుల్ కలాంగా పేరు మార్చడం అభినందనీయమని లోకేశ్ను కొనియాడారు. గతంలో జగన్ ఈ పథకాలకు తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు.