కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని జనసేనపార్టీ ఎచ్చెర్ల మండల అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ, సమీకృత ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రైతులకు, పేద మధ్య తరగతి ప్రజలకు అనుకూలమన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, అన్ని రంగాల వారికి అనుకూలమైన బడ్జెట్ అని తెలిపారు.