ఆముదాలవలస మండలం కట్యాచార్యులపేట పంచాయితీ పరిధి హనుమంతుపురం కాలనీలో గల జలజీవన్ మిషన్ ద్వారా.. ఇంటింటికి ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా మోటార్ మరమ్మత్తులకు గురవ్వడంతో సర్పంచ్ ఎన్ని.రామచంద్రరావు ఆధ్వర్యంలో గురువారం కొత్త మోటర్ వేయించారు. త్రాగునీటి సరఫరా పునరుద్ధరణకు సర్పంచ్ చేసిన కృషిని పలువురు స్థానికులు అభినందించారు. కొత్త మోటర్ వేయడంతో త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు అని సర్పంచ్ అన్నారు.