తాడిపత్రి మండలంలోని ఆలూరు కోనలో వెలసిన భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఉన్న హుండీలలో కానుకలను గురువారం లెక్కించామని దేవదాయ శాఖ ఈఓ సుబ్రమణ్యం తెలిపారు. గత ఏడాది అగస్టు 8 నుంచి గురువారం వరకూ రూ. 27, 24, 184 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో సిబ్బంది పాల్గొన్నారు.