సూళ్లూరుపేట: ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఎం నేతలు ధర్నా
ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జమిలి ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనం పెంచాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. అనంతరం ఆర్డీవో కిరణ్మయికి సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు.