సర్వేపల్లి: పోలీసు స్టేషన్ కు హాజరైన మాజీ మంత్రి
మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం సోమవారం హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న కారణంతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున వైసిపి నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వచ్చారు.