అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున నెల్లూరు నగరపాలక సంస్థ నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా విక్రయాలను జరపాలని కమిషనర్ సూర్యతేజ సోమవారం తెలియజేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ జనసమూహం ఉన్న ప్రదేశాల్లో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.