నోటి శుభ్రతతోనే ఆరోగ్యం

1035பார்த்தது
నోటి శుభ్రతతోనే ఆరోగ్యం
ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం మార్చి 20 ను పురస్కరించుకొని ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కనిగిరి పురపాలక సంఘంలోని స్థానిక వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ వైద్యశాలలో ఆటో డ్రైవర్లకు నోటి క్యాన్సర్ అరికట్టడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ.. నోటి శుభ్రతతో ఆరోగ్యమని చక్కటి నోటి ఆరోగ్యం కోసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని శీతల పానీయాలు వినియోగం తగ్గించాలని ఏదైనా ఆహారం తిన్న వెంటనే నోరు పుక్కులించుకొని నోటిని శుభ్రపరుచుకోవాలని అలాగే పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కలిగించారు. నోటి ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని దంత, గుండె వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని నోటి పరిశుభ్రత లేక పోవటం వల్ల ఎక్కువ మంది వివిధ వ్యాధులకు గురవుతారని జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.


దంత వైద్యులు డాక్టర్ కె స్రవంతి నోటి క్యాన్సర్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. నోటి పరిశుభ్రత లేకపోతే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి రకరకాల వ్యాధులకు దారి తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నోటి పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పొగాకు మరియు మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉచితముగా దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని వాటిని అందరూ సద్విని చేసుకోవాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్యకరమైన సూచనలు అందించారు. తదుపరి కాశిరెడ్డి కాలనీ లోని అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎ. ఎన్. ఎం లక్ష్మి, పాఠశాల సిబ్బంది, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, ఆశా కార్యకర్తలు, నవకుమార్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி