కొమరోలు పట్టణంలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 21 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ సీఐ జయరావు వెల్లడించారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మద్యం విక్రయించడం, బెల్టు షాపులు నిర్వహించడం, అక్రమంగా మద్యం తరలించడం వంటివి చట్టరీత్యా నేరమని ఆయన ప్రజలను హెచ్చరించారు.