ఈనెల 14, 15 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులకు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామాగ్రికి రూ. 50 వేలు సోమవారం ఎస్‌కోట మండలం బొడ్డవర ఆయన స్వగృహంలో వితరణ చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచాలని ఆకాంక్షించారు. కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.