నెల్లిమర్ల: భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించారు. చింతగొంది, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడి చేసి బ్రిటీషర్ల గుండెళ్లలో రైళ్లు పరిగెట్టించారు’ అని తెలిపారు.