నెల్లిమర్ల మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త గంటా సత్యనారాయణ తదితర పార్టీ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. పార్టీ నాయకులు కనకల పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.