గంట్యాడ మండలం పెంటశ్రీరామపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సిఎం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం జనసైనికులు కేక్ కట్ చేశారు. నాయకులు రమేష్, నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సారాధి అప్పలరాజు, మజ్జి కోటేశ్వరరావు, ప్రశాంత్, చంటి, కాళి, రాంబాబు, పైడినాయుడు, భూలిరాజు పాల్గొన్నారు.