కురుపాం : మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కి హై కోర్టులో భారీ ఊరట
2019అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరుపున కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పాముల శ్రీవాణి ఎస్టీ కాదని ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టులో నిమ్మక సింహాచలం, జయరాజ్లు 2019లో పిల్ దాఖలు చేశారు. ఇరు వర్గాల రికార్డులను పరిశీలించి సదరు ఎన్నిక సక్రమమేనని పాముల పుష్ప శ్రీవాణి కొండ దొర ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహిళగా శనివారం ధ్రువీకరిస్తూ హైకోర్టు కేసును కొట్టేసింది.