బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో శుక్రవారం పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిముక్కల గిరిబాల పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న పింఛన్లను పింఛన్దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 పింఛన్లను ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటివలస సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.