తెనాలి: రీ సర్వేకు ప్రజలు సహకరించాలి: కమిషనర్
తెనాలి పట్టణం ప్రజలు రీ సర్వేకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీ నుంచి రీ సర్వే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రీ సర్వే కోసం సచివాలయ సిబ్బంది వస్తారని ప్రజలు సహకరించాలన్నారు. రెవెన్యూ రికార్డులు ఆధారంగా సర్వే పూర్తి చేసి భూ యజమానులకు భూ హక్కు పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు.