నరసరావుపే: రోడ్డు మరమ్మతు పనులు తనిఖీ చేసిన చదలవాడ
నరసరావుపేట పట్టణం శ్రీనివాసనగర్ 9వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. అలాగే సీసీ రోడ్లు, కల్వర్టు పనులు, డామేజ్ అయిన రోడ్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పట్టణాభివృద్ధిలో సంబంధిత అధికారులు, సిబ్బంది కృషిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.