చిలకలూరిపేటలో ఇళ్ల స్కామ్ జరిగింది: ఎమ్మెల్యే
గత ప్రభుత్వంలో ఇళ్ల స్కామ్ అతి పెద్దదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చిలకూరిపేటలో 3 కేసులు నమోదు అయ్యాయని అందులో ఒక కేసులో రూ.1.20కోట్లు తిరిగి ఇచ్చి కేసు విత్ డ్రా చేసుకున్నారని అన్నారు. మాజీ మంత్రి రజినీ రూ.7కోట్ల అవినీతికి పాల్పడ్డారని, సీఐడీతో విచారణ జరిపించాలని పుల్లారావు కోరారు.