వెంకటగిరి పాఠశాలలో క్షేత్రస్థాయి నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం
వెంకటగిరి పాఠశాలలో విద్యార్థుల్లో క్షేత్రస్థాయి నైపుణ్యాల పెంపుదల కోసం సమగ్ర శిక్షా పథకం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించామని హెచ్ఎం వాణెమ్మ తెలిపారు. ఈ శిక్షణలో నాలుగవ రోజు ఆదివారం స్థానిక గ్రాండ్ బేకరీ-2లో కేక్స్, ఎగ్ పప్స్, జామ్ఇ వంటి వస్తువుల తయారీ పై విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఓకేషనల్ ట్రైనర్ హరీష్ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.