తడ: బాంబు పేలుడు కేసులో నిందితుడు అరెస్ట్
తిరుపతి జిల్లా తడలో తమిళనాడు పోలీసులపై 2021 సంవత్సరం బాంబుదాడి చేసి పరారైన పాత కేసులో నిందితుడైన జోసెఫ్ వర్గీస్ ను శుక్రవారం తడ రైల్వే స్టేషన్ వద్ద తడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో వర్గీస్ ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురళీకృష్ణ, తడ ఎస్సై కొండప్ప నాయుడు, పోలీస్ సిబ్బందిని నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు అభినందించారు.