ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బంగారు గొలుసు చోరీ
ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం బంగారు గొలుసు చోరీకి గురైంది. ఆసుపత్రిలో విధులు నిర్వహించే కుళ్లాయమ్మ తన మెడలోని 3 తులాల బంగారు గొలుసు తెగిపోయింది. దాన్ని తీసి అక్కడ ఉన్న ఆశా కార్యకర్తకు చూపించారు. ఆమె టేబుల్ పై పెట్టి బయటకు వెళ్లారు. కాసేపటికి వచ్చి చూడగా బంగారు గొలుసు కనిపించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు.