పత్తికొండ: యురేనియం తవ్వకాలు వైసీపీ అభూత కల్పన
ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్లలో ప్రభుత్వం యురేనియం తవ్వకాలు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అభూత కల్పనే అని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం అమరావతిలో మంత్రి టీజీ భరత్, జిల్లా ఎమ్మెల్యేలతో కలసి ఆయన మాట్లాడారు. యురేనియం తవ్వకాలు జరిగితే 150 కిలోమీటర్లలో రేడియేషన్ తో ప్రజలు క్యాన్సర్ బారిన పడతారని, ఉళ్లు ఖాళీ చేయాల్సి వస్తుందన్న ప్రచారాలతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు.