మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు మెంబర్ గా ఉన్న ముస్తఫాపై గుర్తు తెలియని దుండగులు దాడి చేస్తే దాడి వెనక మంత్రి భరత్ హస్తముందని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భరత్ నిజాయితీ గల వ్యక్తి అన్నారు.