డోన్ పట్టణములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో స్థానిక కార్యాలయములో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. డోన్ ఇంచార్జి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, డిసిసి ఉపాధ్యక్షులు యు. జనార్దన్, మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరగాంధీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, ఇందిరమ్మ రాజ్యం లో భారత దేశంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.