గుడివాడ: ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేయాలి
గుడివాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమస్యపై సోమవారం అసెంబ్లీ సమావేశాల క్వశ్చన్ అవర్లో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము సభ దృష్టికి తీసుకువచ్చారు. గత 20 ఏళ్లుగా గుడివాడ నియోజకవర్గం అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్ అనేది గుడివాడ ప్రజల ప్రధాన సమస్యగా మారిందని గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ లో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.