గన్నవరం: పని వేళల పెంపు ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి
పాఠశాలల పని వేళల పెంపు ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంగం రాష్ట్ర కార్యదర్శి దేవరపల్లి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దేవరపల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల పని వేళలు పెంచడం తగదన్నారు.