వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా ఆంజనేయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయన్నారు. అతను ఫేక్ ముఖ్యమంత్రి అంటూ జగన్ను నమ్ముకుని చాలా మంది వలంటరీ ఉద్యోగాలకు వచ్చారన్నారు. ఆగస్టు 2023 నుంచి ఎక్కడ రెన్యూవల్ చేయలేదని. ఉద్యోగాలు లేని వారిని మోసపు మాటలు చెప్పి వారి జీవితాలను అగమ్య గోచరంగా మార్చారని మండిపడ్డారు.