నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెనమలూరు సచివాలయం1 నందు శుక్రవారం నాడు రాత్రి సమయాల్లో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఎం.కిషోర్ బాబు, విఆర్ఓ నాగేశ్వరరావు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో కూడా లబ్ధిదారుల పట్ల చక్కని సహనంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సజావుగా సాగిస్తున్నారు.