పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు విద్యార్థులకు ఆయుధాలు గురించి వివరిస్తూ రబ్బర్ బుల్లెట్లతో గన్ ఫైర్ చేశారు. వజ్రా వాహనం నిర్వహించిన ఫైరింగ్ విద్యార్థులను ఆకట్టుకుంది. అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులు జిల్లా ఎస్పీ గంగాధర్ రావుతో ఫోటోలు దిగారు. ఏఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.