రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించిన ఉండి ఎంఎల్ఏ రఘు రాం కృష్ణంరాజు తీరుకు వ్యతిరేకంగా మచిలీపట్నం కలెక్టరేట్ ను ముట్టడికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.
సోమవారం మచిలీపట్నంలో దళితుల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో దళితులకు - పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ను కలిసి రఘు రామ కృష్ణంరాజుపై ఫిర్యాదు దళిత సంఘాల నేతలు చేశారు.