సామర్లకోట: హుండీ ఆదాయం రూ. 16.12 లక్షలు
సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో 225 రోజులకు హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.16.12 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు గురువారం సాయంత్రం చెప్పారు. దేవాదాయ తనిఖీ అధికారి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఉండూరు లక్ష్మీనారాయణ భక్త సంఘం, స్థానిక భక్త సంఘం ఆధ్వర్యంలో హుండీలు లెక్కించారు. ఆలయ ధర్మ కర్తల మండలి మాజీ చైర్మన్ కంటే బాబు తదితరులు పాల్గొన్నారు.