నిడదవోలు నియోజకవర్గంలో 758 దరఖాస్తులు
నిడదవోలు నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలకు సంబంధించి 19 షాపుల లైసెన్స్ కోసం 758 టెండర్లు దాఖలైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వాటిలో నిడదవోలు టౌన్లో 162, నిడదవోలు మండలం నుంచి 179, ఉండ్రాజవరం మండలం నుంచి 180, పెరవలి మండలం నుంచి 237 దరఖాస్తులు వచ్చాయన్నారు.