బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 1938లో గల కొండతిప్పలను మండల రెవెన్యూ రికార్డు అయినా పిఓబిలో చేర్చాలని ఉమ్మడి వనరుల అభివృద్ధి సమితి జిల్లా కోఆర్డినేటర్ లావణ్య, జిల్లా కమిటీ సభ్యులు ఓబులేసు కోరారు. ఈ సందర్భంగా సోమవారం కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ గ్రీన్ సెల్లో జిల్లా స్థాయి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వనరుల అభివృద్ధి సమితి సభ్యులు పాల్గొన్నారు.