తమపై గౌర శ్రీను అనే వ్యక్తి దాడికి పాల్పడుతున్నాడని గురువారం పోరుమామిళ్ల మండలం రామేశ్వరానికి చెందిన పెద్ద ఓబయ్య, భార్య మహాలక్షుమ్మ వాపోతున్నారు. తాము పంటలకు నీటికోసం బోరు వేయించున్నాం కాని గౌర శ్రీను ఎటువంటి అనుమతులు లేకుండా తమ బోరుకు 40 మీటర్ల దూరంలో బోరు వేయడంలో తమకు నీరు రావట్లేదని పేర్కొన్నారు. దీనిపై తహశీల్దారిని అడిగితే ఇద్దరి బోరులను సీజ్ చేశారు. అతడు పంట పండించుకుంటున్నాడని పేర్కొన్నారు.