రేపల్లె మండలానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో ఉండగానే 2015లో మృతి చెందారు. మృతుడి తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం 5 లక్షల నగదును మృతుడు తల్లిదండ్రులకు చెక్ రూపంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అందించారు.