గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై సంచరించే ఆవులు, ఎద్దులు, గేదెలను సంబంధిత యజమానులు వారి సొంత ఆవరణలోనే పెంచుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం తెలిపారు. అలా కాకుండా రోడ్లమీదకు వదిలితే వాటిని జీఎంసీ ప్రజారోగ్య సిబ్బంది బంధించి గోశాలకు తరలిస్తారని చెప్పారు. విచ్చలవిడిగా రోడ్ల మీదకు ఆవులను, ఇతర పశువులను వదిలి వాహనాల రాకపోకలకు ఆటంకంగా, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నారన్నారు.