పొన్నూరు: సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆయన స్వగృహంలో సోమవారం లబ్ధిదారునికి పంపిణీ చేశారు. చేబ్రోలు మండలం శలపాడు గ్రామానికి చెందిన గుడ్డం అర్జున్ కి రూ. 58 వేలచెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అడిగిన వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.