అగ్రహారం ప్రాథమిక పాఠశాలను డీఈఓ ఆకస్మిక తనిఖీ
విద్యార్థుల్లో విద్యాప్రగతికి మరింత కృషి చేయాలని పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ అన్నారు. గణపవరం మండలంలోని సిహెచ్ అగ్రహారం ప్రాథమిక పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వర్క్ బుక్స్, నోట్స్ కరెక్షన్, టీచర్స్ డైరీ, పాఠ్య ప్రణాళికలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.