పాలకొల్లు: నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎంపీడీవో
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని పాలకొల్లు ఎంపీడీవో నాగళ్ళ ఉమామహేశ్వరరావు అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, 15వ ఫైనాన్స్ నిధులను వినియోగించి గ్రామాలలో శానిటేషన్ పారిశుధ్య పనులను నిర్వహించాలని కోరారు. క్లాప్ మిత్రలకు వేతనాన్ని 15వ ఫైనాన్స్ నుండి చెల్లించాలని సూచించారు.