నూజివీడు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. పాత రావిచర్ల , కొత్త రావిచర్ల గ్రామాల్లో రూ, 20 లక్షలు, పాత రావిచర్లలో రూ. 15లక్షలతో సుమారు రూ. 35 లక్షలతో సిసి రోడ్ల శంకుస్థాపన చేశారు.