మలికిపురం మండలం కేశనపల్లి-తూర్పుపాలెం సీసీఎఫ్ సొసైటీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన మహాజన సభలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక పార్కుల విధానానికి, కేంద్ర ప్రభుత్వం సహకారం జోడించి కొబ్బరి పరిశ్రమ తూర్పుపాలెంలో ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందన్నారు. దీనితో కొబ్బరికాయకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు.