సామర్లకోట: మద్యం షాప్ పెడితే సహించేది లేదు
సామర్లకోట బళ్ల మార్కెట్ సెంటర్ లో మద్యం షాపు పెడితే సహించేది లేదంటూ బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు, ఎఐఎండీఎస్ పేరుతో బుధవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి నూతన మద్యం షాపులు తెరిచేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన పలువురు ఈ ప్రాంతంలో మద్యం షాపును ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.