రంగంపేట: ఏసీబీ వలలో సర్వేయర్
తూర్పూ గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న దుర్గారావు సోమవారం ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ బృందం, డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అతడి కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అయితే మండలంలోని ఈలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు అనే వ్యక్తి నుంచి సర్వేయర్ ధర్మారావు రూ.75,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకొని దుర్గారావును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.