దళిత డాక్టర్ పై దాడి చేయడం దారుణం
దళిత డాక్టర్ ఉమా మహేశ్వరరావు పై దాడి చేయడం సరికాదని దళిత నాయకులు ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద జిజిహెచ్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసినందుకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం దళితుల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికంగా జరిగాయని తెలిపారు.