ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత పటేల్ సూచించారు. మంగళవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి బాణాసంచా దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.