చిత్తూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బందిని నియమించాలి.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ పీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం దాసరి చంద్ర అధ్యక్షతన జరిగింది. ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడు యస్. నాగరాజు, ఇన్ పేషంట్ల కోసం అవసరమైన శానిటేషన్ సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం సిబ్బంది నియమించాలని, అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.