కాకినాడ: బాధిత కుటుంబాలను పరామర్శించిన పవన్
పోలీసుల నిర్లక్ష్య ధోరణిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదాల మృతుల కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. రోడ్డు ప్రమాదాల్లో పోలీసుల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. సమయానికి బాధితులకు సహాయం అందించకపోతే వారు విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. పోలీసులు బాధ్యతగా పని చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.