కడియం: మహిళా కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి
పొలాలు, నర్సరీలలో పనిచేసే మహిళా కూలీలు జాగ్రత్తలు వహించాలని గుబురుగా ఉన్న పొలాల్లోకి ఒంటరిగా వెళ్లరాదని కడియం ఎస్ఐ ధనలక్ష్మి ప్రసన్న పేర్కొన్నారు. కడియం మండలం దుళ్ల పంట పొలాలు, నర్సరీలో పనిచేసే మహిళ కూలీలకు శుక్రవారం ఎస్ఐ సూచనలు చేశారు. మహిళలు పొలం పనులకు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని, చీకటి పడే వరకు మహిళా కూలీలు నర్సరీల్లో పనిచేయరాదన్నారు.