క్రోసూరు: పోసానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
టీటీడీ ఛైర్మన్ గా బిఆర్ నాయుడుకు పదవి కట్టబెట్టడంతో పోసాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రాణి అన్నారు. గురువారం ఆమె క్రోసూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవాకులు చవాకులు పేలిస్తే నాయకులు దాకా అవసరం లేదని టీడీపీ కార్యకర్తలే నాలుక కత్తిరిస్తారని హెచ్చరించారు. ఆడవాళ్లపై గౌరవం లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు.